మావోయిస్టు పార్టీ ఒక సంచలన ప్రకటన చేసింది. వచ్చే ఏడాది జనవరి 1, 2026 నుండి తమ సాయుధ పోరాటాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. MMC (మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఈ ప్రకటన విడుదల అయింది.
మావోయిస్టు పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ఊహించనిదిగా ఉంది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సాయుధ పోరాటాన్ని తాము నిలిపివేస్తున్నామని, జనవరి 1 నుండి ‘సాయుధ విరమణ’ (Armed Ceasefire) ప్రకటిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.ప్రభుత్వాలు, పోలీసుల వైపు నుంచి ఎలాంటి దాడులు లేదా ఆపరేషన్లు జరగకపోతేనే తమ ఈ నిర్ణయం కొనసాగుతుందని ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ అనూహ్య నిర్ణయం వెనుక గల కారణాలు, మరియు ప్రభుత్వంతో ఏదైనా సంప్రదింపులు జరిగాయా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మావోయిస్టుల ఈ ప్రకటన ఉభయ రాష్ట్రాల్లోని భద్రతా వర్గాలలో మరియు రాజకీయ నాయకులలో తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read:బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్,బీజేపీ నాయకులు

