రాజీవ్‌ తరహాలోనే మోడీ హత్యకు కుట్ర..

190
modi

ప్రధాన మంత్రి నరేంద్రమోడీని హతమార్చే కుట్రను భగ్నం చేశారు పుణె పోలీసులు. నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలు కలిగి ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి నుంచి లభించిన లేఖలో ప్రధాని మోడీ హత్యకు సంబంధించిన కుట్ర బయటపడింది.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన తరహాలోనే.. ప్రధాని మోడీని కూడా టార్గెట్ చేయాలని మావోలు ఓ లేఖలో విశ్లేషించారు. ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన ఆ లేఖను రాసినట్లు పోలీసులు గుర్తించారు. రాజీవ్ గాంధీని హతమార్చినట్లుగా ప్లాన్ వేయాలని, మనం విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నా పక్కా ప్లాన్ వేసి అమలు చేయాలన్నారు. లేదంటే రోడ్‌షో సమయంలో మోడీని టార్గెట్ చేయడం ఉత్తమం అని మావోలు ఆ లేఖలో అభిప్రాయపడ్డారు.

Image result for మోడీ సయీద్

మరోవైపు 2008 ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు చెందిన పాక్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా (జేయూడీ) నేత ప్రధాని మోడీని చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. భారత్, అమెరికా దేశాల్లో ఇస్లాం జెండా ఎగురుతుందని.. మోడీని చంపేస్తాం… భారత్, ఇజ్రాయెల్ దేశాలు ముక్కలు కావడం తథ్యం అంటూ మౌలానా బషీర్ అహ్మద్ ఖలీ పేర్కొన్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ముంబై పేలుళ్లు సహా పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో కుట్ర పన్నిన హఫీజ్ సయీద్‌ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. అతడి తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది.