చేపమందుపై నమ్మకం పెరిగింది: తలసాని

217
talasani

బత్తిన సోదరులు పంపిణీ చేసే చేపమందు ప్రసాదంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌తో కలిసి చేపమందు ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం మాట్లాడిన తలసాని చేపమందు పంపిణీ కోసం ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు చేప ప్రసాదం కోసం వస్తున్నారన్నారు. బత్తిన హరినాధ్‌ గౌడ్‌ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి ప్రభుత్వం పూర్తిసహకారం అందించటం సంతోషంగా ఉందన్నారు. చేప ప్రసాదం పై సీఎం కేసీఆర్ సైతం జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారని అన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

fishmedicine

ఇదిలా ఉండగా ఉదయం నుంచే ఉబ్బసం వ్యాధి గ్రస్తులు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ 133 ప్రత్యేక బస్సులను ఎగ్జిబిషన్‌ మైదానం వరకు నడుపుతుంది. కాగా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో శుక్రవారం ఉదయం ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు సాగనుంది.

fish medicine talasani