ఆయుధాల విరమణపై మావోల లేఖ

6
- Advertisement -

మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకుంటూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంచలన లేఖ రాశారు. ఆయుధాలు విరమించడానికి (Cessation of Arms) సిద్ధంగా ఉన్నామని, అయితే దానికి ఒక షరతు విధించారు.

ఆ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కూంబింగ్ ఆపరేషన్‌లను పూర్తిగా నిలిపివేస్తే, తాము ఆయుధాల విరమణ తేదీని ప్రకటిస్తామని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు.ఈ ముఖ్యమైన నిర్ణయంపై అంతర్గతంగా చర్చించుకుని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఫిబ్రవరి 15, 2026 వరకు తమకు సమయం ఇవ్వాలని మావోయిస్టులు ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వాలు తమ కూంబింగ్ ఆపరేషన్‌లను నిలిపివేస్తే, MMC జోన్ (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్) పరిధిలో ఉన్న మావోయిస్టులందరూ సామూహికంగా లొంగిపోతామని ఆ లేఖ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ లేఖ మూడు రాష్ట్రాల్లో భద్రతా వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ALso Read:USA:డోజ్ విభాగం మూసివేత

 

- Advertisement -