మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతమయ్యాడు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో హిడ్మాతో పాటు మరో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
మృతుల్లో హిడ్మా భార్య, అలాగే మరో ఇద్దరు కీలక నేతలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఎన్‌కౌంటర్ వివరాలను ఉన్నతాధికారులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా పనిచేసే హిడ్మా, ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ తర్వాత తన దళంతో సహా ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు వైపు వచ్చాడని సమాచారం.
గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు, గ్రేహౌండ్స్ దళాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మా దళం మట్టుబెట్టబడింది. హిడ్మా మరణం మావోయిస్టు పార్టీకి, ముఖ్యంగా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి తీరని లోటని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌తో ఏజెన్సీ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Also Read:TTD:ఫిబ్రవరి దర్శన కోటా రిలీజ్

