TG:మావోయిస్టు బ్యానర్ల కలకలం..

12
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆర్.కొత్తగూడెం సమీపంలో ప్రధాన రహదారిపై మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు వెలిశాయి. జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు నక్సల్స్ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

మరోవైపు, భద్రాచలం సబ్ డివిజన్ల సరిహద్దుల పరిధిలో పోలీసుల ముమ్మర తనిఖీలు చేపట్టారు. భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం, ఛత్తీస్‌గఢ్ వెళ్లే రహదారిలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు సీఆర్పీఎఫ్ జవాన్లు.

పోలీస్ జాగిలాలతో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు పోలీసులు. మావోయిస్టు వారోత్సవాలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ములుగు ఏజెన్సీలో కూంబింగ్ కొనసాగుతోంది. వెంకటాపురం, వాజేడు ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు.

Also Read:తెలంగాణ కేబినెట్ భేటీ..

- Advertisement -