మావోయిస్టు నేత కత్తి మోహన్ రావు గుండెపోటుతో మృతి..

53

మావోయిస్టు సీనియర్ నేత కత్తి మోహన్ రావు అలియాస్ ప్రకాశాన్న ఈరోజు గుండెపోటుతో మృతి చెందారు. ఈ మేరకు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు. నక్సల్బరీ రెండవ తరం నేత కత్తి మోహనరావు. 11వ తేదీ 10 గంటలకు సంస్మరణ సభ జరిపి విప్లవ సాంప్రదాయం ప్రకారం ప్రజలు PLGA బలగాలు విప్లవ నినాదాలతో ఊరేగింపుగా వెళ్లి అంతిమాసంస్కారం నిర్వహించామని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. కామ్రెడ్ కత్తి మోహనరావు భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అందించలేక పోయినందుకు చింతిస్తున్నామని తెలిపారు. మోహనరావు కుటుంబానికి , బంధుమిత్రులకు తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుందని పేర్కొన్నారు.