పోలీసుల అదుపులో మావోయిస్టు దేవా!

15
- Advertisement -

పోలీసుల అదుపులో మావోయిస్టు కమాండర్ బార్సే దేవా పట్టుబడటం భద్రతా వర్గాల్లో కీలక పరిణామంగా మారింది. మావోయిస్టు సంస్థలో బెటాలియన్-1 కమాండర్‌గా పనిచేస్తున్న బార్సే దేవాను ములుగు జిల్లా బయ్యక్కపేట సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిఘా సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

బార్సే దేవా స్వగ్రామం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓయూ పారా ప్రాంతం. చిన్న వయసులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరిన దేవా, క్రమంగా మిలిటరీ శిక్షణలో ఆరితేరాడు. అడవుల్లో యుద్ధ నైపుణ్యాలు, ఆయుధాల వినియోగంలో ప్రత్యేక నైపుణ్యం సాధించిన అతడిని 2022లో బెటాలియన్-1 కమాండర్‌గా నియమించారు. అప్పటి నుంచి తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన పలు మావోయిస్టు దాడుల్లో దేవా కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.

ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలపై దాడులు, విధ్వంసక కార్యకలాపాలకు దేవా నేతృత్వం వహించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి అరెస్టుతో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టుగా అధికారులు భావిస్తున్నారు.

ALso Read:నితీశ్ కుమార్..ఆస్తులెంతో తెలుసా?

 

- Advertisement -