మను చరిత్ర..రిలీజ్ డేట్ ఫిక్స్

42
- Advertisement -

యంగ్ హీరో శివ కందుకూరి హీరోగా తెరకెక్కుతున్న ‘మను చరిత్ర ‘చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో శివ సరసన మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్లుగా నటించారు. భరత్ పెదగాని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

మను చరిత్ర వరంగల్ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ లవ్ స్టోరీ. శివ ఇంటెన్సివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. గతంలో విడుదల చేసిన టీజర్ అతన్ని ఫెరోషియస్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదల తేదీని అనౌన్స్ చేసి టీమ్ జోరుగా గా ప్రమోషన్లను ప్లాన్ చేస్తోంది. ‘మను చరిత్ర’ జూన్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీ విజయ ఫిల్మ్స్ ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను పొందింది.

Also Read:ఉప్పల ప్రణీత్‌ని అభినందించిన సీఎం కేసీఆర్…

ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై ఎన్ శ్రీనివాస రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించగా, రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రాఫర్. తారాగణం: శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్, సుహాస్, డాలీ ధనంజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, మధునందన్, రఘు, దేవిశ్రీ ప్రసాద్, ప్రమోదిని, సంజయ్ స్వరూప్, హర్షిత, గరిమ, లజ్జా శివ, కరణ్, గడ్డం శివ.

Also Read:కాంగ్రెస్ కు దెబ్బ తీస్తోంది అదే !

- Advertisement -