Paris Olympics 2024 : చరిత్ర సృష్టించిన మ‌ను భాక‌ర్‌..

19
- Advertisement -

పారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్ పిస్ట‌ల్ విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్‌- మను బాకర్‌ జోడీ కాంస్య ప‌త‌కాన్ని సొంతం చేసుకుంది. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియా జోడీ వోన్హో లీ- యే జిన్ ఓహ్ పై జంట‌పై 16-10 తేడాతో గెలుపొందింది.

ఈ పతకం సాధించడంతో మను భాకర్…స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా రికార్డుల‌కు ఎక్కింది. ఆదివారం వ్య‌క్తిగ‌త విభాగం 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్‌లో మ‌ను భాక‌ర్ కాంస్య ప‌త‌కాన్ని గెలుపొందిన సంగ‌తి తెలిసిందే.

ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఇద్దరు ఉన్నారు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజత పతకంను సాధించాడు రెజ్లర్ సుశీల్. బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది.

Also Read:TTD: ఆగస్టు 1 నుండి శ్రీవారి పుష్క‌రిణి మూత

- Advertisement -