కాంగ్రెస్ కు మరో షాక్.. టీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు?

967
Duddilla Sridhar Babu
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగలనుంది. ఇటివలే 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరి సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసిన సంగతి తెలిసందే. తాజాగా మరో కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ ను వీడనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.

శ్రీధర్ బాబు పీసీసీ అధ్యక్ష పదవి కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆ పదవి రాదని క్లారిటీ రావడంతో పార్టీని విడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. శ్రీధర్ బాబు టీఆర్ఎస్ లో చేరితే అసెంబ్లీలో  కాంగ్రెస్  బలం 5కు చేరుతుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 4కు చేరనుంది.

- Advertisement -