‘లియో’ చిత్రంలో నటి త్రిషతో రేప్ సీన్ లేకపోవడంతో బాధగా అనిపించిందంటూ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో ఎట్టకేలకు మన్సూర్ అలీఖాన్ త్రిషకు క్షమాపణలు చెప్పాడు. త్రిషపై తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదన్నాడు. ఆమె పెళ్లికి తాను మంగళసూత్రం ఇచ్చి ఆశీర్వదించాలని అనుకుంటున్నానని కూడా తెలిపాడు. మొత్తానికి నటుడు మన్సూర్ అలీఖాన్ లో మార్పు కనిపిస్తోంది. అసలు తాను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి, క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏముంది ? అన్నట్టు మాట్లాడుతూ వచ్చాడు.
కానీ, మన్సూర్ త్రిషపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పమవ్వడం, పైగా అతని పై కేసు నమోదు అయ్యింది. పైగా ఆయన తన వ్యాఖ్యలతో తీవ్ర వ్యతిరేకతను కూడా ఎదుర్కున్నారు. దీంతో మన్సూర్ అలీఖాన్ వెనక్కి తగ్గక తప్పలేదు. చివరకు మన్సూర్ క్షమాపణ చెప్పాడు. ఇక మన్సూర్ క్షమాపణపై త్రిష కూడా స్పందించింది. తప్పు చేయడం మానవ లక్షణమని.. క్షమించడం దైవంతో సమానమని ట్వీట్ చేసింది. ఇక అటు మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి పెద్ద పెద్ద స్టార్ల వరకు త్రిషకు అండగా నిలబడ్డారు. అందుకే,మన్సూర్ కూడా వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. లేదు అంటే. త్రిష కు క్షమాపణలు చెప్పడం, మన్సూర్ కి అస్సలు ఇష్టం లేదు.
Also Read:Bigg Boss 7 Telugu:అమర్‌కి దెబ్బేసిన శివాజీ