ప్రపంచంలో కెళ్లా మహిళలకు అత్యంత ప్రమాదకర దేశంగా భారత్ మొదటి స్థానంలో ఉందని రాయిటర్స్ ఫౌండేషన్ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. భారత్ లో మహిళలను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఈ సర్వే తేల్చింది. ఈ సర్వే వెల్లడిపై హీరో మంచు మనోజ్ స్పందించారు. భారత్ ఈ జాబితాలో ఉండడం చాలా బాధాకరమని ట్వీట్ చేశాడు. మన దేశంలో మహిళలు సురక్షితంగా, స్వేచ్చగా ఉండేందుకు మనవంతు బాధ్యత వహించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మార్పు తీసురావాలని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఇదే సంస్థ 2011లో వెల్లడించిన సర్వేలే భారత్ నాలుగో స్థానంలో ఉండగా.. 2018 సర్వేలో మాత్రం మొదటి స్థానంలోకి వచ్చింది. దేశంలో రోజు రోజుకు మహిళలపై పెరుతున్న అత్యాచారాలతో ఈ జాబితాలో భారత్ మొదటి స్థానంలోకి వచ్చింది రాయిటర్స్ సర్వే వెల్లడించింది. మహిళల రక్షణకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోవడం వలనే మహిళలపై అత్యాచారాలు పెరుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.
ఇక మనపక్క దేశమైనా పాకిస్థాన్ 2011 వెల్లడించిన సర్వేలో మూడోస్థానంలో ఉండగా.. 2018 నాటికి ఆరవ స్థానానికి చేరడం విశేషం. మరోవైపు అగ్రరాజ్యంగా పేరున్న అమెరికా పదవ స్థానంలో ఉంది. ఐక్యరాజ్య సమితిలో శాస్వత సభ్యత్వం ఉన్న ఐదు దేశాలలో అమెరికా ఒక్కటే ఈ జాబితాలో ఉండడం గమనార్హం.
Sad to see the way our country is being listed in these categories…We remain responsible and need to change the situation to provide a safer nation to the women. Let’s make a difference! 🙏🙏 pic.twitter.com/ZNECyVFSI5
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) June 27, 2018