Bihar Elections:అది ఫేక్ వీడియో

7
- Advertisement -

బిహార్ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ఇవాళ్టితో తొలిదశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ పార్టీకి నటుడు మనోజ్ బాజ్‌పేయ్ మద్దతిస్తున్నట్లు ఓ వీడియో వైరల్‌గా మారింది.

దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు మనోజ్. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. అది ఎవరో సృష్టించిన ఫేక్ వీడియో. దయచేసి అటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయట్లేదు అని మనోజ్ బాజ్‌పేయ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లుగా ఈ వీడియోలో ఉండగా ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో మరింత చర్చనీయాంశమైంది.

 

Also Read:ఉగ్ర‌వాద సానుభూతిప‌రులు..అరెస్ట్

- Advertisement -