ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ తన తాజా చిత్రం ‘పండిట్’ టైటిల్‌కు సంబంధించి నెలకొన్న వివాదంపై స్పందించారు. ఈ సినిమా టైటిల్‌లోని “పండిట్” అనే పదం ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలవడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే దర్శకుడు నీరజ్ పాండే ఈ వివాదంపై స్పందిస్తూ, ప్రచార చిత్రాలను తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అదే నిర్ణయాన్ని సమర్థిస్తూ మనోజ్ బాజ్‌పేయ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము భాగమైన ఏ అంశం కొంతమందిని బాధపెడితే తప్పకుండా ఆగి వారి మాట వినాల్సిన బాధ్యత తమపై ఉంటుందని అన్నారు. నటుడిగా తాను కేవలం కథను, పాత్ర స్వభావాన్ని మాత్రమే చూస్తానని చెప్పారు.
ఈ చిత్రంలో ఒక వ్యక్తిలోని లోపాలు, అతని ఆత్మపరిశీలన ప్రయాణాన్నే చూపించామని, ఇది ఏ వర్గం లేదా కులానికి వ్యతిరేకంగా రూపొందించిన సినిమా కాదని స్పష్టం చేశారు. దర్శకుడు నీరజ్ పాండే ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రచార చిత్రాలను తొలగించడం తమ గంభీరతను చాటుతుందని మనోజ్ బాజ్‌పేయ్ పేర్కొన్నారు.
I respect the emotions and concerns people have shared, and I take them seriously. When something you are part of causes hurt to some people, it makes you pause and listen.
As an actor, I come to a film through the character and the story I am playing. For me, this was about… https://t.co/IGlQtLQeNs
— manoj bajpayee (@BajpayeeManoj) February 6, 2026
Also Read:KTR:ప్రజల గుండెల్లో కేసీఆర్ ధ్రువతార

