నకిలీ మద్యంతో ఆరోగ్యానికి హాని:క్రిశాంక్

11
- Advertisement -

గాంధీభవన్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎలాంటి మద్యం కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం చేయడానికి ప్రతిపాదనలు పెట్టలేదని చెప్పారు. పైగా అలా ప్రచారం చేసే మీడియా సంస్థలపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తారని బెదిరించారన్నారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిశాంక్. 27 మే 2024న బిఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి అబద్ధాన్ని బహిర్గతం చేస్తూ Som Distilleries అనే సంస్థకు అనుమతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం పై మీడియా సమావేశం పెట్టడం జరిగింది.దీనికి జవాబుగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు 28 మే న పత్రిక లేఖ విడుదల చేసి Som Distilleries అనే సంస్థకు అనుమతులు ఇవ్వడం వాస్తవమే అని ఒప్పుకున్నారు.

జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేశారని మరిచినట్టున్నారు. నకిలీ మద్యానికి పేరుగాంచిన Som Distilleries వ్యాపార సంస్థ తెలంగాణ రాష్ట్రంలో తన వ్యాపారం మొదలు పెడుతుంటే కనీసం సమాచారం లేదని మంత్రి అనడం బాధ్యతరహితం. Som Distilleries సంస్థకు కార్పొరేషన్ వారే అనుమతులు ఇచ్చారు మంత్రికి సమాచారం లేదని తన లేఖలో పేర్కొనడం హాస్యాస్పదం.
ప్రభుత్వ ఆదాయానికి మరీ ముఖ్యంగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ నకిలీ మద్యం అంశం మంత్రికి తెలియకుండానే ప్రెస్ మీట్ పెట్టి 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించి ఇప్పుడు తెలియదని చెప్పడం రాష్ట్ర ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. రేపటి దినం ఈ నకిలీ మద్యంతో రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు మంత్రి ఇలాగే తనకు సమాచారం లేదని అధికారుల మీదకి నెట్టేస్తారా? మంత్రి బాధ్యత వహించరా ? అని ప్రశ్నించారు.

ఈ సంవత్సరం 26 ఫిబ్రవరి 2024న మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో అబ్కారి విభాగం Som Distilleries సంస్థకు నకిలీ మద్యం అమ్ముతున్నందుకు నోటీసులు ఇచ్చింది వాస్తవమే కదా, సెక్షన్లు 420, 467, 468, 471, 120 B ఆరోపణలతో సంస్థ చైర్మన్ జగదీష్ అరోరా పై కేసు వేసి జైలుకు పంపింది వాస్తవం కదా. దీనిపై మంత్రి జూపల్లి తన లేఖలో ఎందుకు సమాధానం చెప్పలేదు ?మధ్యప్రదేశ్ ప్రభుత్వ SIT విచారణలో మూరేనా అనే ప్రాంతంలో నకిలీ మద్యం సేవించి 24 మంది చనిపోయినప్పుడు, విచారణలో భాగంగా తేలిన విషయం ఆ మరణాలకు కారణం నకిలీ మద్యమని Som Distilleries కు సంబంధించిన 20 స్పిరిట్ మరియు రిసీవర్ ట్యాంకులను ప్రభుత్వం సీల్ చేసిన విషయం మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలియకుండానే అనుమతులు ఇచ్చారా ? ఈ విషయంపై బీఆర్ఎస్ ప్రశ్నించడాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు తన లేఖలో ఎందుకు సమాధానం చెప్పలేదు.Som Distilleries నకిలీ మద్యం సంస్థ వద్ద కాంగ్రెస్ పార్టీ విరాళాలు తీసుకోవడాన్ని ఎందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించలేదు ? మూడుసార్లు 25 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ Som Distilleries వద్ద తీసుకున్నది. ఒకసారి ఏకంగా ఒక కోటి 31 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి Som Distilleries నుంచి అందినయి. ఒక నకిలీ మద్యం సంస్థ అయిన Som Distilleries కు వకాల్త పుచ్చుకొని స్వయాన మంత్రి తన లేఖలో ఆ సంస్థ గొప్పతనాన్ని చెప్పడం విడ్డూరం అన్నారు.

వారం ముందు ఇలాంటి వ్యాపారాలు తెలంగాణ రాష్ట్రంలో వస్తలేదని చెప్పి వారం తర్వాత బీఆర్ఎస్ బయటపెట్టిన అనంతరం ఆ కంపెనీ గురించి గొప్పలు చెప్పి ఆ Som Distilleries నకిలీ మద్యం కంపెనీకి వ్యాపారం కట్టబెట్టినరంటే కాంగ్రెస్కు కమిషన్ ముట్టినాయని తెలుస్తుంది. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని అప్పటివరకు Som Distilleries అనే నకిలీ మద్యం సంస్థకు తెలంగాణ రాష్ట్రంలో వారి మద్యాన్ని అమ్మే అనుమతులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం. జూపల్లి కృష్ణారావుగారు మంత్రిగా కొనసాగితే ఈ విచారణపై రాజకీయ ఒత్తిడి పెట్టే అవకాశం ఉంది, కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతున్నాం. లేదంటే సంస్థకు కాంగ్రెస్ పార్టీకి ఈ డీల్ కుదరడంలో సీఎం రేవంత్ పాత్ర ఉందని భావించవలసి వస్తుందన్నారు.

Also Read:పొట్లకాయ రసంతోప్రయోజనాలు!

- Advertisement -