కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్

14
- Advertisement -

ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్నారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. ఉదయం 11 గంటలకు కమిషన్ కార్యాలయం బీఆర్‌కే భవన్‌కు చేరుకోనున్నారు కేసీఆర్.

విచారణలో భాగంగా కేసీఆర్‌కు సంఘీభావంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్‌ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను విచారించింది కాళేశ్వరం కమిషన్. హరీశ్‌ రావును 45 నిమిషాల పాటు విచారించగా అన్ని వివరాలను అందించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను సీఎం రేవంత్ సర్కార్ నియమించిన సంగతి తెలిసిందే.

Also Read:ముఖరా(కే) ప్రజలు..ప్రకృతి రక్షకులు

- Advertisement -