కంటోన్మెంట్ ఎమ్మెల్యేపై క్రిశాంక్ సంచలనం

1
- Advertisement -

మా కంటోన్మెంట్ వన్ టైమ్ ఎమ్మెల్యేకు ప్రతీ దాంట్లో కమీషన్లు కావాలి అని ఆరోపించారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్. తిరుమలగిరి చెరువు పని మేము మొదలుపెడితే, అక్కడికి ఈయన వెళ్లగానే పని ఆగిపోయింది అన్నారు.

మేము కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కూడా అవినీతికి పాల్పడుతున్నాడు… బాహుబలి సినిమాలో మాహిష్మతి సామ్రాజ్యం లాగా నిర్మించిన అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి ఇంతవరకు ఎందుకు పూర్తి అవ్వడంలేదు? .. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్వయంగా టిమ్స్ ఆసుపత్రి పనులు 90% పూర్తయ్యాయని చెప్పాడు అన్నారు.

Also Read:రాహుల్ వ్యాఖ్యలపై లోక్‌సభలో కలకలం

2028 వరకు పనులు పూర్తి చేయకూడదని నీకు రేవంత్ రెడ్డి చెప్పాడా? … బీఆర్ఎస్ ప్రభుత్వం 90% పనులు పూర్తి చేసిన టిమ్స్ ఆసుపత్రి ఇప్పటి వరకు ఎందుకు పూర్తి అవ్వలేదో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి… పోలీసులు కూడా మేము ఇక్కడి అనుమతి లేకుండా రావొద్దని అంటున్నారు… ఇది ప్రజల కోసం కట్టించిన ఆసుపత్రి, ఎవరైనా రావొచ్చు ..పోలీసులకు కూడా నేను చెప్తున్నా, మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు.

- Advertisement -