మన్‌ కీ బాత్‌..ఏప్రిల్‌ 30న 100వ ఎపిసోడ్‌

38
- Advertisement -

దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ చేపట్టిన మన్‌ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30కల్లా వందవ ఎపిసోడ్‌ను ప్రసారం కానుంది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున్న ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జాతీయ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ చలనచిత్ర నటులు ఆమీర్‌ఖాన్, రవీనా టాండన్, క్రీడాకారిణి నిఖత్ జరీన్‌ సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు పాల్గొన్నారు.

Also Read: DMK:ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు.. ఎంటంటే..!

మోదీ మన్‌కీ బాత్ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఏర్పాటు చేసే విధంగా కేంద్రమంత్రులు ఎంపీలకు బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కార్యక్రమాల గురించి వివరించారు. దేశంలో గుర్తింపుకు నోచుకోని వ్యక్తలను వెలుగులోకి తేవడం సహా అనేక అంశాలతో ఈ కార్యక్రమం ద్వారా జనబాహుళ్యంలోకి తెచ్చారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మంచి విషయాలు బయటికి వచ్చిన కొన్నింటి విషయంలో మోదీ మౌనం వహిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

Also Read: Delhi:మేయర్ పీఠంపై షెల్లీ ఒబెరాయ్‌

2014 అక్టోబర్3న ప్రారంభమైన మన్‌ కీ బాత్…ప్రతి నెలా చివరి ఆదివారం రోజున ఉదయం 11.00గంటలకు ప్రారంభమయ్యేది. అయితే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా ప్రసారం చేయాలని బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం రూ.100నాణేలను కూడా విడుదల చేయనున్నారు.

- Advertisement -