- Advertisement -
మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శనివారం మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనుండగా అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.
మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా 7 రోజుల సంతాప దినాలను ప్రకటించింది కేంద్రం. రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు. ఇవాళ కేంద్ర మంత్రిమండలి సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలుపనుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఏడు రోజులపాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంపైనా జాతీయ జెండాను సగానికి దించారు.
Also Read:మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత..
- Advertisement -