మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మాజీ ప్రధానికి కన్నీటి నివాళి అర్పించారు. కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు సైతం మన్మోహన్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్సింగ్ అంతిమ సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేశారు.
తొలుత మోతీలాల్ నెహ్రూ రోడ్డులో మన్మోహన్సింగ్ నివాసంలోనే ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం ఇవాళ ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.
యావత్ భారతావని మన్మోహన్ చేసిన సేవలను గుర్తించుకోగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ తదితరులు ఆయన పార్థివదేహం వద్ద పుష్పాంజలి ఘటించారు.
Also Read:మన్మోహన్‌కు బీఆర్ఎస్ నేతల నివాళి