మ‌న్మోహ‌న్ సింగ్ ఆస్తులెన్నో తెలుసా?

3
- Advertisement -

దేశంలో ఆర్ధిక సంస్కరణల పితామహుడిగా, పది సంవత్సరాల పాటు యూపీఏ 1, యూపీఏ2ను నడిపించిన నేతగా పేరు తెచ్చుకున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. వయోభారం, అనారోగ్యంతో 92 సంవత్సరాల వయస్సులో తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే.

శనివారం మన్మోహన్ అంత్యక్రియలు జరగనుండగా వివాదరహితుడిగా, దేశానికి నిస్వార్ధంగా సేవలు అందించారు మన్మోహన్. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా త‌న ప‌ద‌విలో కొన‌సాగారు.

మన్మోహన్‌కు భార్య గురుశరణ్ కౌర్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయ‌న ఆస్తుల విలువ రూ.15 కోట్ల 77 లక్షలు. రాజ్యసభలో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం.. ఢిల్లీ, చండీగఢ్‌లో ఆయనకు ఫ్లాట్ మాత్ర‌మే ఉంది. ఎ ప్రధాని పదవి నుంచి తప్పుకున్న తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు.

Also Read:మన్మోహన్‌కు ప్రధాని మోదీ నివాళి

- Advertisement -