ఆప్ సర్కార్ తీసుకొచ్చిన నూతన లిక్కర్ పాలసీపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెనక్కితగ్గింది ఆప్. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆ విధానం అమలు అవుతుందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. ఎక్సైజ్ పాలసీ గడువు ముగుస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
లీగల్‌గా మద్యాన్ని అమ్మడం నిలిపివేస్తే, అప్పుడు గుజరాత్ లాంటి ఘటనలు జరుగుతాయని అన్నారు. ఢిల్లీలో నాటు సారా విషాదాలను సహించబోమని, అందుకే కొత్త లిక్కర్ విధానం బదులుగా, మద్యాన్ని పాత పద్ధతిలోనే అమ్మనున్నట్లు సిసోడియా తెలిపారు.
కొత్త విధానాన్ని సమర్ధించిన సిసోడియా.. అవినీతిని అడ్డుకునేందుకు ఆ విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల గుజరాత్‌లో కల్తీ మద్యం తాగి 42 మంది మరణించారు. అయితే అలాంటి సంఘటనలు ఢిల్లీలో జరగనివ్వబోమని సిసోడియా స్పష్టం చేశారు.