విరాళాల సేకరణలో జేడీయూ టాప్!

67
- Advertisement -

దేశంలోని ప్రాంతీయ పార్టీల విరాళాలపై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ నివేదిక విడుదల చేసింది. ఇందులో బిహార్ అధికార పార్టీ జనతాదళ్ యునైటెడ్ అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్ధానంలో డీఏంకే, ఆప్ ఉన్నాయి. మొత్తం విరాళాల్లో 91 శాతానికి పైగా 113.79 కోట్లు ఐదు పార్టీలకే వెళ్లినట్టు ఏడీఆర్‌ తెలిపింది.

అధిక విరాళాలు ప్రకటించిన మొదటి ఐదు ప్రాంతీయ పార్టీల్లో జనతా దళ్‌ జేడీయూ, డీఎంకే, ఆప్, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌, టీఆర్‌ఎస్‌ ఉన్నాయి. జేడీయూ 330 విరాళాల ద్వారా 60.15 కోట్లు అందుకుంది.

27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన విరాళాల మొత్తం 124.53 కోట్లుగా ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే విరాళాలు పెరిగినట్టు జేడీయూ, డీఎంకే, టీఆర్‌ఎస్‌ ప్రకటించాయి.

- Advertisement -