మణిరత్నం ఆఫర్‌ను తిరస్కరించిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా…

129
- Advertisement -

ఇండియాలోని గొప్ప దర్శకులలో మణిరత్నం ఒకడు. ఈయన నుండి సినిమా వ‌స్తుందంటే ప్రేక్ష‌కులే కాదు సినీప్ర‌ముఖులు కూడా ఎంత‌గానో ఎదురుచూస్తుంటారు. మణిరత్నం టేకింగ్ గాని, విజువ‌లైజేష‌న్ గాని వేరే లెవ‌ల్లో ఉంటాయి. ఈయ‌న సినిమాల్లో క‌థ‌లు సాధార‌ణంగానే ఉన్న…క‌థ‌నం గొప్ప‌గా ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న ఫిలింమేక‌ర్స్ అందరు దాదాపుగా మ‌ణిరత్నం టేకింగ్‌కు అభిమానులే అయ్యుంటారు. ఎందుకంటే మ‌ణిర‌త్నం త‌న సినిమాల‌తో ఎంట‌ర్టైన్ చెయ్య‌డ‌మే కాకుండా ప్రేక్ష‌కుల‌ను ఆలోచింప‌జేస్తుంటాడు. ఇండియాలో ఎంత పెద్ద స్టార్ అయినా మ‌ణిర‌త్నంతో ఒక్క సినిమా చేయాల‌ని ఆశ ప‌డుతుంటారు. అయితే ఒక హీరో మాత్రం మణిరత్నం ఆఫర్‌ను తిరస్కరించాడట.

ఆ హీరో ఎవరా అనుకంటున్నారా? ఆయన మరెవరో కాదు చియాన్‌ విక్రమ్‌. ఇటీవలే ఈయన మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్‌ సెల్వన్‌-1 లో కరికాలన్‌గా నటించిన విషయం తెలిసిందే. కాగా గతంలో మణిరత్నం బొంబాయి సినిమాను మొదట విక్రమ్‌తో చేయాలనుకుని కథను కూడా నెరేట్‌ చేశారు. కానీ చివరి నిమిషంలో ఈ హీరోను మార్చాల్సి వచ్చిందన్నారు. దీనికి కారణం విక్రమ్‌ మరో సినిమా కోసం గడ్డం పెంచుకున్నారు. గడ్డం తీసేయమని అడిగితే దానికి విక్రమ్‌ ఒప్పుకోలేదని మణిరత్నం చెప్పారు. దాంతో మణిరత్నం అరవింద స్వామితో బొంబాయి సినిమా తీసి బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సాధించాడు.

మణిరత్నం తెరకెక్కించిన గొప్ప చిత్రాల్లో బొంబాయి కూడా ఒకటి. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 1995లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో అరవింద స్వామి, మనీషా కొయిరాల నటించారు అనడం కంటే జీవించారు అనడం సబబు. మణిరత్నం ప్రేమ కథలను ఎంత అందంగా, పోయెటిక్‌గా చెప్పగలడో ఈ చిత్రంతో నిరూపించాడు.

- Advertisement -