మణిపూర్ ఎఫెక్ట్..బీజేపీ వీడుతున్నా నేతలు!

65
- Advertisement -

ఈ మద్య మణిపూర్ ఘటనలు దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇద్దరు కుకి మహిళలను కొందరు నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగించిన అమానుష ఘటన ఒక్కసారిగా పెను దుమారం రేపింది. ప్రపంచ దేశాల ఎదుట భారత్ పరువు పోయేలా చేసింది. ఈ ఘటన తరువాత ఆ రాష్ట్ర ప్రభుత్వంపై మరియు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రజాగ్రహం పెరిగింది. ఇంతటి దారుణ ఘటనలు జరుగుతునప్పటికి మోడి ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా వ్యవహరిస్తోందని సామాన్యులు సైతం దుమ్మెత్తి పోస్తున్నారు..

మోడి సర్కార్ వైఖరి పై బీజేపీ నేతలు కూడా తీవ్ర అసహనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలమంది పార్టీ వీడేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇటీవల బీజేపీ అధికార ప్రతినిధి వినోద్ శర్మ మోడి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి బీజేపీకి రాజీనామా చేశారు. మణిపూర్ లో జరుగుతున్నా హింస కు మోడీ నే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. మణిపూర్ లో ఈ స్థాయి అల్లర్లు చోటు చేసుకుంటున్నా నరేంద్ర మోడీ నిద్ర పోతున్నారని అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Also Read:KTR:33 శాతానికి పెరిగిన గ్రీనరీ

బేటీ బచావో అని నినదించే మోడీ.. మణిపూర్ ఘటన కనిపించలేదా ? అంటూ ప్రశ్నించారు. ఇద్దరు మహిళలను వివస్త్రలు గా చేసి ఊరేగించినప్పుడే అంతర్జాతీయంగా భారత్ పరువు పోయిందని అందుకే తను బీజేపీలో ఉండదలచుకోలేదని వినోద్ శర్మ చెప్పుకొచ్చారు. ఇక ఈయన దారిలోనే మరికొంత మంది బీజేపీ నేతలు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మణిపూర్ ఘటనతో బీజేపీ మతతత్వ రాజకీయం అందరికీ తెలిసొచ్చి పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది.

Also Read:బ్రో అదిరింది.. కానీ అవే మైనస్

- Advertisement -