మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో బీరెన్ సింగ్ రాజీనామా చేసినట్లు సమాచారం.
జాతుల మధ్య వైరంతో మణిపూర్ అట్టుడికిపోతోంది. దాదాపు రెండేళ్లుగా ఆ రాష్ట్రం రావణకాష్టంలా రగిలిపోతోంది. హింసాత్మక ఘటనలలో 250 మంది వరకు చనిపోయారు. అల్లర్లను అరికట్టడంలో బీరెన్ సింగ్ ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు ఆరోపించాయి.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలా లేక కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తారా అనే అంశంపై ఆయన సంప్రదింపులు జరపనున్నారు. మణిపూర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి బలం ఉన్నప్పటికీ.. అవిశ్వాస తీర్మానంలో తాను నెగ్గుతానే నమ్మకం బీరెన్ సింగ్ కు లేదని తెలుస్తోంది.
Also Read:ప్రజలే విజేతలు..ఢిల్లీని అభివృద్ధి చేస్తాం

