గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి” వంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు క్రిష్. గౌతమి పుత్ర శాతకర్ణి’ ఘన విజయం తరువాత ‘మణికర్ణిక’ అనే మరో చారిత్రక చిత్రాని తెరకెక్కిస్తున్నాడు క్రిష్. కొంతవరకూ క్రిష్ దర్శకత్వం వహించగా, ప్రస్తుతం కంగనాయే దర్శకురాలిగా వ్యవహరిస్తోంది. దర్శకత్వ బాధ్యతలు ఆమెనే స్వీకరించడంతో, ఈ ప్రాజెక్టుపై మరింతగా ఆసక్తి పెరిగింది
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా…టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది చిత్రయూనిట్.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన టీజర్ ను విడుదల చేయనున్నారు. జనవరి 25వ తేదీన సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమాలో విలన్‌గా సోనూసూద్ నటిస్తున్నారు.