‘మణికర్ణిక’ ట్రైలర్..

226
Manikarnika
- Advertisement -

బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. ఈ సినిమాకి చాలావరకూ క్రిష్ దర్శకుడిగా వ్యవహరించి ఆ తరువాత తప్పుకోవడంతో, మిగిలిన భాగానికి కంగనానే దర్శకత్వ బాధ్యతను వహించింది. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించారు.

తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో క‌ద‌నరంగంలో క‌ర‌వాలం ప‌ట్టి శ‌త్రు మూక‌ల‌ని గ‌డ‌గ‌డ‌లాడించే ధీర వ‌నితగా కంగనా అద‌ర‌గొట్టింది. ట్రైల‌ర్‌తో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రానికి సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు స్వరాలు సమకూరుస్తున్నారు.

Manikarnika

‘ఝాన్సీ ప్రాంతంపై బ్రిటిషర్ల కన్నుపడింది. ఒకవేళ ఝాన్సీని కాపాడే అధికారి రాకపోతే ఈ ప్రాంతాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుంది’ అని ఓ మహిళ చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. అప్పుడు ఓ వ్యక్తి వచ్చి..‘నేను ఇందాక ఓ అమ్మాయిని చూశాను. తన పేరు మణికర్ణిక’ అని చెప్తున్నప్పుడు కంగన పులిని వేటాడుతున్న సన్నివేశం ఆకట్టుకుంటోంది. జనవరి 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

- Advertisement -