గర్జించిన…మణికర్ణిక

319
Manikarnika
- Advertisement -

వీర వనిత ఝాన్సీ లక్ష్మీభాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మణికర్ణిక. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా మణికర్ణిక టీజర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

ఎప్పటినుండో సినిమా టీజర్‌ కోసం ఆసక్తిగా ఎదరుచూస్తున్న ఫ్యాన్స్‌ ఉహించిన విధంగానే టీజర్‌ని అద్భుతంగా తెరకెక్కించారు. అజాదీ అంటూ కంగనా గర్జించిన తీరు అందరిని కట్టిపడేసింది.క‌ద‌నరంగంలో క‌ర‌వాలం ప‌ట్టి శ‌త్రు మూక‌ల‌ని గ‌డ‌గ‌డ‌లాడించిన మణికర్ణికగా హవభావాలను చక్కగా పలికించింది. ఈ చిత్రానికి సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు స్వరాలు సమకూరుస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కాగా, కొంత ప్యాచ్ వ‌ర్క్ ఇటీవ‌ల పూర్తి చేశారు.

- Advertisement -