నిర్మాణ రంగంలోకి విజయ్‌ దేవరకొండ…

214
vijay devarakonda
- Advertisement -

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్‌ని షేక్ చేసిన హీరో విజయ్ దేవరకొండ. తర్వాత వచ్చిన అర్జున్‌ రెడ్డి సినిమాతో యూత్‌ ఐకాన్‌గా మారిపోయాడు విజయ్‌. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్‌ ఓ వైపు రౌడీ క్లబ్‌ పేరుతో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. తాజాగా సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు.

నోటా పబ్లిక్ మీట్‌లో మాట్లాడిన విజయ్‌…కొత్త ప్రొడక్షన్‌ సంస్థతో ముందుకువస్తున్నానని అందరూ ఆశీర్వదించాలని చెప్పారు.  కింగ్ ఆఫ్ ది హౌజ్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ  కార్య‌క్ర‌మంలో ప్రొడ‌క్ష‌న్ హౌజ్ లోగో విడుద‌ల చేసిన విజయ్..   ఐదు భాషల్లో అక్టోబ‌ర్ 5న నోటా చిత్రం విడుద‌ల కానుందని తెలిపారు.

ప్రస్తుతం రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సుధీర్ బాబు వంటి హీరోలు ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌లు స్ధాపించి సక్సెస్‌ సాధించారు. తాజాగా వారిబాటలోనే విజయ్ చేరిపోయాడు.

- Advertisement -