ఉలగనాయకన్ కమల్ హాసన్ ఇండియన్ సినిమా లివింగ్ లెజెండ్. 6 దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో కల్ట్ క్లాసిక్ విజయాలతో, ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్తగా అద్భుతమైన సినిమాలని అందించాలనే తపనతో పని చేస్తున్నారు. తన అద్భుతమైన విజన్, రైటింగ్, డైరెక్షన్ తో అశేషమైన ప్రేక్షకాదరణ పొందిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం. కమల్ హాసన్, మణిరత్నం 37 సంవత్సరాల క్రితం నాయకన్/నాయకుడు లాంటి ఆల్-టైమ్ క్లాసిక్‌ని అందించారు. మూడు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి ‘థగ్ లైఫ్’ అంటూ ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను దర్శకుడు మణిరత్నం పంచుకున్నారు. ఈ చిత్రానికి చాలా టైటిల్స్ పరిశీలించామని, అయితే ‘థగ్ లైఫ్’ అనే టైటిల్ ని కమల్ స్వయంగా ప్రకటించారని.. ఈ టైటిల్ అందరికీ నచ్చడంతో దీన్నే ఫిక్స్ చేశామని ఆయన తెలిపారు.
ఈ సినిమాలో శింబు, త్రిష, అశోక్ సెల్వన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ 5న గ్రాండ్ రిలీజ్ కానుంది.
Also Read:కేసీఆర్ కట్టిన సచివాలయం అద్భుతం:జగన్

