దర్శకుడు మణిరత్నంకు బంబు బెదిరింపులు..

242
Mani Ratnam
- Advertisement -

దక్షిణాది సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకులలో మణిరత్నం ఒకరు.తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ చిత్రం`నవాబ్` తమిళనాట ఘన విజయం సాధించింది.టాలీవుడ్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ హిట్ టాక్‌తో మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మణిరత్నానికి తన కార్యాలయాన్ని బాంబులతో పేల్చి వేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.

Mani Ratnam

ఈ సినిమాలో ఒక అభ్యంతరకర డైలాగ్‌ను తొలగించాలని చెన్నైలోని అభిరామపురంలో ఉన్న మణిరత్నం కార్యాలయానికి ఓ ఆగంతుకుడు ఫోన్ చేశాడు.లేని పక్షంలో ఆఫీసును పేల్చేస్తామని బెదిరించారని అయితే, సినిమాలోని ఏ డైలాగ్‌ను తొలగించాలో మాత్రం చెప్పలేదని మణిరత్నం కార్యాలయ సిబ్బంది తెలిపారు. బెదిరింపులకు సంబంధించి ఫిర్యాదు అందడంతో మణిరత్నం కార్యాలయానికి పోలీసులు భద్రతను కల్పించారు.

- Advertisement -