చాలమందికి మొఖంపై నల్లటి పొడలు లేదా మచ్చలు ఇబ్బంది పెడుతుంటాయి. వీటినే మంగు మచ్చలు అని కూడా అంటారు. ఇవి ఒక్కసారి ముఖంపై ఏర్పడితే అంతకంతకూ పెరుగుతూనే ఉంటాయి. తద్వారా ముఖం అందహీనంగా కనిపిస్తుంది. ఈ మచ్చలు ఆడ, మగ ఇద్దరిలోనూ కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆడవారిలో ఈ మంగు మచ్చలు అధికంగా ఏర్పడుతుంటాయి. ఇవి రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ముఖంపై దుమ్ము, ధూళి పెరుకుపోవడం, హార్మోన్ల అసమతుల్యత, శరీరంలో వేడి పెరగడం.. వంటి కారణాల వల్ల మొఖంపై మంగు మచ్చలు ఏర్పడుతుంటాయి,.
ఎండలో ఎక్కువగా పని చేసే వారిలో కూడా ఈ మచ్చలు కనిపిస్తుంటాయి. వీటి కారణంగా నలుగురిలో తిరగడానికి ఇబ్బంది పడుతుంటారు చాలమంది. అందువల్ల ఈ మంగు మచ్చలను తగ్గించుకునేందుకు రకరకాల క్రీమ్ లతో పాటు మెడిసన్స్ కూడా ఉపయోగిస్తుంటారు. ఇలా ఏవేవో వాడడం వల్ల ముఖం పై దృష్ప్రభావం చూపి మొఖంల మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ మంగు మచ్చలను సహజసిద్దంగా తగ్గించుకునేందుకు ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం !
* కొద్దిగా నిమ్మరసం మరియు తేనె కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలపై సున్నితంగా అప్లై చేసి 10-15 నిముషాల పాటు సున్నితంగా మర్దన చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి, ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మంగు మచ్చలు తగ్గిపోతాయి.
* పాల పదార్థాలు అనగా వెన్న కూడా మంగు మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. తాజా వెన్నను మచ్చలపై రాసి 10 నిముషాలు మర్దన చేస్తే మచ్చలు తగ్గడంతో పాటు ముఖం కాంతివంతంగా తయారవుతుంది. టమాటో కలబంద కూడా ఈ మచ్చలను తగ్గించడంలో సహాయ పడతాయి.
* కొద్దిగా టమాటో రసం తీసుకొని అందులో కొద్దిగా కలబంద గుజ్జు కలుపుకొని మచ్చలపై అప్లై చేసి కొద్ది సేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే మచ్చలు తగ్గడంతో పాటు ఆకర్హనీయంగా కనిపిస్తుంది. ఇంకా ఇవి మాత్రమే కాకుండా ముల్తానీ మట్టి, బంగాళదుంప నీరు వంటివి కూడా మంగు మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి
Also Read:గోవింద కోటి రాసిన బెంగుళూరు విద్యార్థిని..