రస్టిక్‌ థ్రిల్లర్‌.. ‘మంగళవారం’

40
- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమిర్ జంటగా నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ (X) ద్వారా ‘మంగళవారం’ ట్రైలర్ విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో ఆయన విడుదల చేయగా… ఆఫ్‌లైన్‌లో హీరో కార్తికేయ విడుదల చేశారు. చిరంజీవి ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ ”ఈ సినిమా నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నాకు సన్నిహితులు. ముఖ్యంగా స్వాతి రెడ్డి ఎంతో డైనమిక్ అమ్మాయి. మా అమ్మాయి శ్రీజకి మంచి స్నేహితురాలు. నాకు యువత, అందులోనూ యంగ్ విమెన్ సినిమా ఇండస్ట్రీలో వివిధ శాఖల్లోకి ఎంటర్ అవుతుంటే చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ కొత్త ఆలోచనలు, న్యూ ఎనర్జీ తో ఫిలిం మేకింగ్, మార్కెటింగ్ లకి ఒక కొత్త డైరెక్షన్ ని ఇవ్వగలరు. అందుకని స్వాతి రెడ్డి లాంటి యంగ్ స్టర్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి అజయ్ భూపతి లాంటి ఓ టాలెంటెడ్ డైరెక్టర్ తో కలిసి తొలి ప్రయత్నంగా ఈ సినిమా చేయటం ఎంతో సంతోషం. విలేజ్ నేపథ్యంలో రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఎంటైర్ టీంకి ఆల్ ది బెస్ట్!” అని ట్వీట్ చేశారు.

Also Read:కాంగ్రెస్‌కు అదే సెంటిమెంట్ రిపీట్!

యువ కథానాయకుడు, అజయ్ భూపతి తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 100′ హీరో కార్తికేయ మాట్లాడుతూ ”ఆర్ఎక్స్ 100’ విడుదలై ఐదేళ్లు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఆ సినిమా సక్సెస్ మీట్‌లో ఉన్నట్టు ఉంది. ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైన తర్వాత నుంచి నేను, అజయ్ భూపతి లేదా నేను, పాయల్ ఎప్పుడు చేస్తామని అందరూ అడుగుతుంటే మంచి కథ కుదరాలని చెబుతూ వచ్చా. వాళ్ళిద్దరికీ నేను ఫేవరెట్ అన్నట్లు ఉంటారు. ఒక రోజు వాళ్ళిద్దరూ సినిమా చేస్తున్నట్లు న్యూస్ చూశా. సర్లే ఏం చేస్తాం! మంచితనానికి రోజులు కావు ఇవి. నన్ను వదిలేసి సినిమా చేశారు. ‘ఆర్ఎక్స్ 100’ షూటింగ్ 50 రోజుల్లో కంప్లీట్ చేశాం. అజయ్ భూపతి 100 రోజులు షూటింగ్ చేస్తే ఎంత పెద్ద సినిమా తీస్తాడో నాకు తెలుసు. వాళ్ళ సొంతూరు ఆత్రేయపురంలో ‘ఆర్ఎక్స్ 100’ తీశాడు. ఇప్పుడు ఆ ఊరిని మరో విధంగా ఈ సినిమాలో చూపించాడు. గోదావరి అంటే వంశీ గారి సినిమాల్లో ఉన్నట్టు ఉంటుందని అనుకుంటాం. ‘ఆర్ఎక్స్ 100’తో కొత్త జానర్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడీ సినిమా. 100 పర్సెంట్ అందరి కంటే ఈ సినిమా కంటే ఎక్కువ నేను వెయిట్ చేస్తున్నా. అజనీష్ సంగీతం అద్భుతంగా ఉందని ట్రయిలర్ చూస్తే అర్థం అవుతోంది” అని అన్నారు.

- Advertisement -