మాండూస్ ఎఫెక్ట్..భారీ వర్షాలు

134
- Advertisement -

మాండూస్ ప్రభావంతో తమిళనాడు, ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మాండూస్ తుపాను వాయుగుండంగా మారిందని, మరో 12 గంటల్లో బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలో పలు చోట్ల రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో ఏపీలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఏపీలోని రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

సోమశిల ప్రాజెక్టుకు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో పెన్నా నదిలోకి 40 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.ముందుజాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -