మండలి వైస్‌ఛైర్మన్‌గా బండా నామినేషన్‌..

25
- Advertisement -

తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్‌ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పదవీకాలం 2021 జూన్‌3న పూర్తయింది. దీంతో అప్పటి నుంచి డిప్యూటి ఛైర్మన్‌ పదవీ ఖాళీగా ఉంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ బండా ప్రకాశ్‌ పేరును సూచిస్తూ శనివారం నామినేషన్‌ వేయాల్సిందిగా సూచించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సంబంధిత పార్టీ నాయకులు చేయాలని  సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

ఫిబ్రవరి 12న ఉదయం 10గంటలకు శాసనమండలి ప్రారంభమైన అనంతరం డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసి బాధ్యతలు అప్పగించనున్నారు. బండా ప్రకాశ్‌ బీఆర్ఎస్ తరపున 2018లో రాజ్యసభకు ఎంపికయ్యారు. అయితే ఎంపీగా ఆరేండ్ల పదవీకాలం పూర్తికాక ముందే 2021 నవంబర్‌ ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎన్నికయ్యారు.

ఇవి కూడా చదవండి…

నూతన సచివాలయంపై బండి సంచలన వ్యాఖ్యలు

తిరుమల అప్‌డేట్..

పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం: కేసీఆర్

- Advertisement -