విష్ణు వర్సెస్ మనోజ్..వెండి తెరపై!

1
- Advertisement -

మంచు ఫ్యామిలీలో మరోసారి వార్ జరగనుంది. అది వెండితెరపై. మంచు విష్ణు తన కలల ప్రాజెక్టు కన్నప్పను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మధుబాల, శరత్ కుమార్, కాజల్ ఇలా అగ్రశ్రేణి నటులు అంతా ఈ సినిమాలో భాగంకాగా ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నారు.

అయితే విష్ణు కన్నప్పకి పోటీగా మంచు మనోజ్ రాబోతున్నట్టు తెలుస్తుంది. మంచు మనోజ్, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్.. ముగ్గురు కలిసి భారీ మల్టీస్టారర్ గా భైరవం సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు కానీ ఏప్రిల్ లో వస్తాం అని ప్రకటించారు.

దీంతో ఇప్పుడు బాక్సాఫీస్ వార్ మంచు విష్ణు వర్సెస్ మనోజ్‌గా మారింది. దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు మంచు మనోజ్. దీంతో కన్నప్ప, భైరవం సినిమాలపై మంచి అంచనాలే ఉండగా బాక్సాఫీస్ వద్ద ఎవరు విజేతగా నిలుస్తారో వేచిచూడాలి.

Also Read:‘రాబిన్‌హుడ్‌’..టికెట్ ధరల పెంపు

- Advertisement -