ప్రకాశ్ రాజ్‌ది మొసలి కన్నీరు: విష్ణు

58
vishnu

ప్రకాశ్ రాజ్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు మంచు విష్ణు. తనపై ప్రకాశ్‌ రాజ్‌ చేసిన ఆరోపణలు ఖండించిన విష్ణు…ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రకాశ్‌ రాజ్ చిన్న విషయాన్ని కూడా పెద్దది చేస్తుందన్నారు. ఆయన చేసిన ఆరోపణల్లో ఒక్కటి నిజం లేదన్నారు.

మాలో 160 నుండి 190 మంది దాకా 60 సంవత్సరాల పైబడిన వారు ఉన్నారని కరోనా నేపథ్యంలో ఓటింగ్ పై వారి అభిప్రాయం తీసుకోగా వారంతా పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేస్తామని తెలిపారని మంచు విష్ణు చెప్పారు. ఇక ఇతర ప్రాంతాల్లో షూటింగ్‌లో బిజీగా ఉన్నవారు పోస్టర్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరానని వెల్లడించారు.

మా సభ్యులందరికి ఫోన్ చేసి తనకు మద్దతివ్వాలని కోరానని తెలిపారు విష్ణు. మా ఎన్నికల్లో విజయం తనదేనని జోస్యం చెప్పారు. ప్రకాశ్ రాజ్‌ బీపీ మాత్రలు వేసుకోకుండా వచ్చి ఇష్టం వచ్చినట్లు ఇవాళ మాట్లాడారని కానీ తాము ఏం చేసిన ఈసీని సంప్రదించే చేస్తున్నామని వెల్లడించారు. నోరుంది కదా అని ప్రకాశ్‌ రాజ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అలాంటి వారు సర్వనాశనం అవుతారన్నారు. కృష్ణ, కృష్ణంరాజుని అవమానించేలా ప్రకాశ్‌ రాజ్ మాట్లాడటం సరికాదన్నారు.నడిఘర్ సంఘం మూత పడటానికి ప్రకాశ్‌ రాజే కారణమని తమిళ నటీనటులను ఎవరూ అడిగినా చెబుతారన్నారు. ‘మా’ను భ్రష్టు పట్టించడానికే ప్రకాశ్‌ రాజ్ ఇక్కడికి వచ్చారన్నారు.