టీఆర్ఎస్‌లో చేరికల జోరు…బీజేపీ బేజారు

142
harishrao
- Advertisement -

హుజూరాబాద్ ఓటర్లు తెరాసకే పట్టం కట్టనున్నారు. గ్రామాలకు గ్రామాలు కారు గర్తుకే మా ఓటంటూ ముందుకు వస్తున్నారు. ఆయా సామాజిక వర్గాల ఓటర్లు సైతం గెల్లు గెలుపు తమ బాద్యత అంటూ ప్రకటిస్తున్నారు. మరో వైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి స్థానిక నాయకత్వం గులాబీ పార్టీలో చేరుతుండటంతో ఆ పార్టీలు బేజారెత్తుతున్నాయి. తాజాగా ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన 150 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు తెరాసలో తీర్థం పుచ్చుకున్నారు. రాచపల్లికి చెందిన యువ నేత అశోక్ యాదవక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యాదవులు, ముస్లింలు సింగపురం లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమక్షంలో తెరాసలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సింగపురంకు చెందిన 150 మంది యువకులు తెరాసలో చేరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీష్ రావు… బీజేపీ- టీఆర్ఎస్ మాత్రమే పోటీలో ఉన్నాయన్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. ఈ దిశగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్,కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, 2016 రూ. ఆసరా పెన్షన్ వంటి పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

బీజేపీ మాత్రం వాతలు– కోతలు మాత్రమే ప్రజలకు పెడుతోందన్నారు. పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరల పెంచి ప్రజలకు వాతలు పెడుతూ..మరో వైపు సబ్సిడీల్లో కోతలు విధించిందన్నారు. ఇలాంటి పార్టీ వల్ల ప్రజలకు ఒరిగిందేంటి…నల్ల ధనం వెనక్కు తెచ్చి ప్రతీ అక్కౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పిన బీజేపీ ఏడేళ్ల పాలనలో ఒక్క రూపాయి నల్ల ధనం వెనక్కు తెచ్చిందా…. ఒక్క రూపాయి అయినా మీ అక్కౌంట్లలో పడ్డాయా అని అడిగారు హరీష్ రావు.

పెద్ద నోట్లు రద్దు తో నల్ల ధనం బయటకు వస్తుందని చెప్పి వేయి రూపాయల నోట్లు రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం రెండు వేల పెద్ద నోటును తెచ్చిందన్నారు. కానీ నల్ల ధనం మాత్రం బయటకు రాలేదు.కాని మనమంతా మాత్రం బ్యాంకు వద్ద లైన్లు కట్టాల్సిన పరిస్థితి తెచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ, కుదవపెడుతూ… ఉద్యోగాలు తొలగిస్తున్నారు. ఇలాంటి బీజేపీకి బుద్ది చెప్పాలి. హుజూరాబాద్ ఓటర్లు బీజేపీ పాలన తీరును గమనించి వాత పెట్టాలన్నారు.హుజురాబాద్ అభివృద్ధి మా బాధ్యత. ఇక్కడి సమస్యలన్నీ తెరాస ప్రభుత్వమే పరిష్కరిస్తుందన్నారు.

- Advertisement -