టాలీవుడ్‌లో మంచు వారసులు విష్ణు, మనోజ్ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ ఇద్దరు హీరోలకు సరైన హిట్ పడలేదు. ఈ క్రమంలో సినిమాలు తగ్గించేశారు. ఇక మంచు విష్ణు మా ఎలక్షన్స్‌లో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు రెడీ అవుతుండగా, మనోజ్ అహం బ్రహ్మాస్మి అనే సినిమా చేస్తున్నాడు. కాగా ఇటీవల తమ్ముడు మనోజ్‌తో మంచు విష్ణుకు గొడవలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.
దీనిపై మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వ్యక్తిగత విషయాల గురించి ఇతరులు ఎందుకు చర్చించుకుంటారంటూ నిలదీశాడు. తాజాగా ‘అలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్న మంచు విష్ణు ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ… తన అక్క మంచు లక్ష్మి తమతో కాకుండా వేరుగా ఉంటుందని, అలాగే మంచు మనోజ్ కూడా వేరుగానే ఉంటాడని విష్ణు వివరించాడు. తాను తన తండ్రి మోహన్ బాబుతో ఉంటున్నానని తెలిపాడు. అంతేగానీ, తమపై వస్తోన్న అసత్య ప్రచారానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు.