మా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం మంచు విష్ణు, ఆయన ప్యానల్ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది తెలుగు సినీనటుల ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం. మా ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దని రాజకీయ పార్టీలకు నేను ముందే చెప్పా. కానీ, ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ‘మా’లో ఉన్న 900మంది నాకు ఓటు వేసేందుకు సుముఖంగా ఉన్నారు.
నా మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవిగారు, పవన్‌గారు వచ్చి నాకే ఓటు వేస్తారు. నాకు నమ్మకం ఉంది. నాన్నగారి గురించి పవన్‌కల్యాణ్ అడిగిన ప్రశ్నలకు ఆయనే సమాధానం ఇస్తారు. ఇప్పటికే ఈ విషయమై ఆయన ప్రకటన కూడా విడుదల చేశారు. 10వ తేదీ ఎన్నికలు అయిపోగానే 11వ తేదీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ మాట్లాడతారు’’ అన్నారు. సినిమా టికెట్లను ఆన్ లైన్లో అమ్మాలనే ఏపీ ప్రభుత్వ నిర్ణయం గురించి పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు సరికాదని చెప్పారు. పవన్ కామెంట్స్‌తో ఇండస్ట్రీ ఏకీభవించలేదని, తాను కూడా ఏకీభవించడం లేదని అన్నారు.