మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదం నేపథ్యంలో రాచకొండ సీపీ ఎదుట విచారణకు హాజరయ్యారు నటుడు మంచు విష్ణు. సుమారు గంటన్నర సేపు విష్ణును విచారించారు సీపీ సుధీర్ బాబు. నాలుగు రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న వివాదాలపై ఆరా తీశారు. మరోసారి గొడవలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు ఉంటాయి…శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు.
శాంతి భద్రతలు విగాథం కలిగించేలా వ్యవహరిస్తే లక్ష రూపాయలు జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే మరోసారి ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని సీపీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. జల్‌పల్లి నివాసంలో ఉన్న ప్రైవేటు సెక్యూరిటీని పంపించాలని విష్ణును ఆదేశించిన సీపీ…జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో బాండ్ పేపర్ల పై విష్ణు సంతకాలు తీసుకున్నారు.
Also Read:ఈ వివాదానికి కారణం వినయ్: మనోజ్