మా ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన మంచు విష్ణు..

58

అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానల్స్ పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంచు విష్ణు తన ప్యానెల్ మేనిఫెస్టో విడుదల చేశారు. తాము గెలిస్తే ఏమేం చేస్తారో వివరించి మా సభ్యులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేనిఫెస్టోను విడుదల చేశాడు.

మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు…

-మా సభ్యుల పిల్లల విద్యకు ఆర్థిక సాయం
-నిరుద్యోగ ఆర్టిస్టుల ప్లిలలకు ఉపాధి
-నూతన యువతకు ప్రోత్సహాం
-సొంత ఖర్చులతో మా భవనం