‘మంచు’ రియాలిటీ షో

60
- Advertisement -

మంచు విష్ణు, మనోజ్ సన్నిహితులతో గొడవపడుతూ వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంచు సోదరుల మధ్య జరిగిన గొడవ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మీడియాలో ఆ వీడియోతో వచ్చిన బజ్ అంతా ఇంతా కాదు. , అయితే ఇదంతా ఓ రియాలిటీ షో కోసం అంటూ తాజాగా బాంబ్ పేల్చాడు విష్ణు. “ది కర్దాషియన్స్” మాదిరిగానే భారతదేశపు అతిపెద్ద రియాలిటీ షోగా “హౌస్ ఆఫ్ మంచుస్” అనే రియాలిటీ టీవీ షోను రూపొందించాలనే ఆలోచనతో ఉన్నాడు విష్ణు. అందులో భాగంగానే మనోజ్ కలిసి ఓ వీడియో రిలీజ్ చేశాడు.

తాజాగా ప్రజల్లో క్యూరియాసిటీ పెంచేలా షో టీజర్‌ను విడుదల చేశారు. ముందు మనోజ్ రిలీజ్ చేసిన వైరల్ వీడియో పెట్టి దానికి కంటిన్యూగా ప్రోమో వదిలారు. అందులో షో ఎలా ఉండబోతుంది అనే విషయలు పెద్దగా చెప్పలేదు. త్వరలోనే ఫుల్ డీటైల్స్ చెప్పనున్నారు.

ఈ షో మంచు ఫ్యామిలీ వ్యక్తిగత జీవితాలపై దృష్టి సారిస్తుంది. AVA ఎంటర్‌టైన్‌మెంట్‌పై విష్ణు స్వయంగా నిర్మించనున్నాడు. ఈ ఆలోచన నెటిజన్లల్లో అభిమానులలో బజ్ క్యూరియాసిటీని సృష్టించింది. మరి ఈ రియాలిటీ షో ఎందులో టెలికాస్ట్ అవ్వనుంది ? అనే డీటైల్స్ కూడా తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి…

Kajal:బాలీవుడ్ కన్నా సౌత్‌ ఇండస్ట్రీస్‌ బెటర్‌..!

పిక్ టాక్ : ప్రగ్యా అందాలన్నీ అదరహో

Balagam:అంతర్జాతీయ వేదికపై మన బలగం సినిమా..!

- Advertisement -