ట్రోలింగ్‌పై మోహన్ బాబు మండిపాటు..

109
mohan babu
- Advertisement -

నెటిజన్ల ట్రోలింగ్‌పై మండిపడ్డారు సీనియర్ హీరో మోహన్ బాబు. మోహన్ బాబు హీరోగా సన్ ఆఫ్ ఇండియా చిత్రం తెరకెక్కింది. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 18న ఈ సినిమా విడుదలకానుండగా నెటిజన్ల ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు.

మోహన్ బాబు మాట్లాడుతూ………సెలెబ్రిటీలపై వస్తున్న ట్రోలింగ్, మీమ్స్ చూసి చాలా బాధ పడుతున్నాను… నిజానికి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆత్మాభిమానం అనేది ఉంటుంది కదా అన్నారు మోహన్ బాబు. కొంతమంది అదే పని మీద ఉంటారు. ఇద్దరు హీరోలు కొంతమందిని అపాయింట్ చేసుకుని ఇలా ట్రోలింగ్ చేయిస్తున్నారు… వినాశకాలే విపరీత బుద్ధి… చెప్పిన వాడిని, చేసిన వాడిని ప్రకృతి చూస్తోందన్నారు.

ఏదో ఒకరోజు వాళ్లకు శిక్ష తప్పదు… మీమ్స్ అనేవి సరదాగా నవ్వుకునేలా ఉండాలన్నారు. అంతేకాని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదన్నారు.

- Advertisement -