ఆర్గానిక్ కథలు, కంటెంట్‌తో కూడిన సినిమాలు: శివ కందుకూరి

41
shiva kandukoori
- Advertisement -

ఇంజనీరింగ్ పూర్తి చేసి న‌ట‌న‌పై ఆస‌క్తితో సినిమారంగంలోకి అడుగుపెట్టిన శివ కందుకూరి 2020లో చూసి చూడంగానే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. న‌టుడిగా గుర్తింపు పొందిన ఆయ‌న‌కు గ‌మ‌నం సినిమా మ‌రింత‌గా పేరు తెచ్చింది. అందులో చారుహాస‌న్‌, శ్రియా శ‌ర‌ణ్ వంటి న‌టీన‌టుల‌నుంచి ఎంతో నేర్చుకున్నాననీ తెలియ‌జేస్తున్నారు. `పెళ్లి చూపులు’ ఫేమ్ రాజ్ కందుకూరి కుమారుడిగా నేప‌థ్యం వున్నా క‌ష్ట‌ప‌డి తానేంటో నిరూపించుకుకోవాల‌నేదే త‌న కోరిక‌ని తెలియ‌జేస్తున్నాడు. శుక్ర‌వారం ఫిబ్ర‌వ‌రి 18న శివ కందుకూరి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా గురువారంనాడు మీడియాలో ప‌లు విష‌యాలను తెలియ‌జేశారు.

  • సినిమా చేయాలంటే క‌థ‌, కేరెక్ట‌ర్‌లో ప‌ర్‌ప‌స్ వుండేలా చూస్తాను. అలాగే అలాగే క‌థ‌ల‌ను ఎంపిక చేసుకున్నా. గ‌మ‌నం అలా చేసిందే. ఆ సినిమా ఓటీటీలో విడుద‌లై అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రేక్ష‌కులు ఆద‌రించారు. దాన్ని బ‌ట్టి నేను ఎంచుకున్న విధానం క‌రెక్ట్ అనిపించింది.
  • నేను కమర్షియల్ సబ్జెక్ట్‌లను మాత్రమే ఎంచుకోవాలని కాదు. దాని నుంచి బ‌ట‌య‌కు వ‌చ్చి అర్థ‌వంతమైన సినిమాలే చేయాలన్నది నా నమ్మకం. నేను నా నమ్మకాలకు వ్యతిరేకంగా వెళ్లలేను.
  • కనీసం నా కెరీర్ తొలిదశలో అయినా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకుంటున్నాను. కమర్షియల్ సినిమాలు చేసినా ఆర్గానిక్ సినిమాలే చేస్తాను. ‘మను చరిత్ర’ ఆర్గానిక్‌గా ఉండబోతోంది. క్యారెక్టర్ జర్నీ, స్టోరీ రియలిస్టిక్ గా ఉంటుంది.
  • నేను ఏ పాత్ర చేసినా పాత్రకు కనెక్ట్ అవ్వాలి. స్క్రిప్ట్‌లో నాకు నమ్మకం ఉండాలి. అల్లు అర్జున్ గారు పుష్ప‌లోని క్యారెక్టర్‌ని నమ్మారు కాబట్టి ‘పుష్ప’ మెప్పించింది. ఆ స్థాయి నమ్మకం లేకుంటే ప్రేక్షకులు ఇంతగా ఆదరించి ఉండేవారు కాదు. ఇది అన్ని రకాల సినిమాలకూ వర్తిస్తుంది.
  • ఏదో ఫ్యామిలీ బేక్‌గ్రౌండ్ వుంది కదాని ఏది బ‌డితే అది చేయ‌కూడ‌దు. ప్రేక్ష‌కులు మ‌న‌ల్ని నిశితంగా గ‌మ‌నిస్తూనేవుంటారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓటీటీ వ‌చ్చాక స్పానిష్‌తోపాటు ప‌లు దేశాల సినిమాల‌ను చూసి ఎన‌లైజ్ చేస్తున్నారు. అందుకే న‌టులుగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.
  • వచ్చే ఐదేళ్లలో నేను కొన్ని సినిమాలు మాత్రమే చేయగలను. వాల్యూమ్ పట్టింపు లేదు. మా నాన్న సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉన్నారు. సినిమా చేయాలా వద్దా అనే నిర్ణయం నాపై ఆధారపడి ఉంటుంది. నాన్న‌గారు కేవలం ఏదైనా స‌జెన్స్‌ మాత్రమే ఇస్తాడు. చాలా సార్లు నా అభిప్రాయాలకే పెద్ద పీట వేస్తారు.
- Advertisement -