మంచు మనోజ్ న్యూ జర్నీ..

262
Manchu-Manoj

హీరో మంచు మనోజ్ గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన వివాహం తర్వాత ఆయన ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కాగా గత కొద్ది రోజులుగా ఆయన కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కొన్ని సమస్యల వల్ల తన భార్యతో విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. ఇక దీపావళి పండుగ సందర్భంగా మంచు మనోజ్ కొత్త జర్నిని ప్రారంభించాడు.

ఇన్ని రోజులు హీరోగా కనిపించిన మంచు మనోజ్ ఇకపై నిర్మాతగా కనిపించనున్నారు. ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌ పేరుతో ఆయన నిర్మాణ సంస్ధను ప్రారంభించారు. ఈ కొత్త జర్నీలో అందరి ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు తనపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. కొత్త టాలెంట్ ను బయటకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. భవిష్యత్‌లో మా ప్రొడక్షన్‌ హౌజ్‌ నుంచి వచ్చే మంచి సినిమాలను మీరు చూస్తారు అంటూ ట్వీట్ చేశారు.