నాగబాబు పై మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్‌!

101
nagababu
- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబుపై మంచు మనోజ్‌ షాకింగ్ కామెంట్స్ చేశారు. హయ్యర్ పర్పస్ లేని వ్యక్తులకు ఏం చేయాలో తెలియదు. ఎప్పుడూ పక్క వారి మీద పడతారు. వారికంటూ ఓ లక్ష్యం, గమ్యం ఉండవు. పోటీ అంటే రెండు పక్కలుంటాయన్నారు. ఒకరిద్దరు ఉంటారు…. ఇటు పక్క వెళ్లి ఓట్లు వేయమని అడిగారు. అటుపక్క ఓట్లు వేయమని అడిగారన్నారు. ఫలానా వ్యక్తి గెలిస్తే బాగుంటుందని జనాలందరూ అనుకున్నారు. మా అన్నను గెలిపించారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఇండస్ట్రీ అందరూ ఫ్రెండ్సే. ఎవరికి ఎవరం హానీ చేసుకోం అన్నారు.

కానీ ఒక వ్యక్తి మాత్రం మా అన్నని టార్గెట్ చేసి మానసికంగా ఇబ్బంది పెడదామని ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. అయినా మా అన్న పట్టించుకోలేదు. నాన్న గారు కూడా పట్టించుకోలేదు. మాకు సపోర్ట్ చేసిన వాళ్లని పెద్ద పెద్ద వాళ్లని కూడా బూతులు తిట్టాడు. అది మీ అందరూ చూశారు. వాళ్లెందుకు అలా చేశారని ఆలోచించాను. వాళ్లకు హయ్యర్ పర్పస్ లేదు వదిలేయ్ పాపం అని నాన్న గారు అన్నారు. కరెక్టే కదా? అని అనిపించిందన్నారు.

అతని చుట్టూ గొప్పగొప్ప వాళ్లున్నారు. వాళ్ళ ఫ్యామిలిలో హయ్యర్ పర్పస్ కోసం జీవించేవాళ్లున్నారు. జనాల కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉన్నవాళ్లున్నారు. కానీ ఆయనకు మాత్రం అలాంటిది ఏదీ లేదు అని ఇండైరెక్ట్ గా నాగబాబుని కౌంటర్ చేస్తూ కామెంట్స్ చేశారు.

- Advertisement -