యాక్షన్ చెప్పక ముందే కట్ చెప్పొద్దు అన్నా- మంచు మనోజ్

53

సినీ నటుడు మంచు మనోజ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడంటూ ఓ వెబ్ సైట్లో వచ్చిన వార్త వైరల్ అయింది. తన తదుపరి చిత్రం గురించి మనోజ్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని ఆ వార్తలో పేర్కొన్నారు. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో వెంచర్స్ ప్రారంభిస్తానని, యువతకు ఉద్యోగావకాశాలను కల్పిస్తానని మనోజ్ చెప్పినట్టు రాశారు.

ఈ వార్తపై మనోజ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు అన్నో. సమ్మర్ నుంచి మన సినిమా స్టార్టు. యాక్షన్ అని చెప్పక ముందే కట్ చెప్పొద్దు అన్నా. అల్వేస్ లవ్యూ అన్నా. వచ్చే ఆర్టికల్ లో నైనా నన్ను ఆశీర్వదించు అన్నా’ అని ట్వీట్ చేశాడు. సదరు వెబ్ సైట్లో వచ్చిన వార్త లింక్ ను కూడా షేర్ చేశాడు.